గిద్దలూరు: పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే

72చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని రాజా నగర్ లో మంగళవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పెన్షన్లు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్లను ప్రతినెలా ఇస్తుందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర భవిష్యత్ , అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అశోక్ రెడ్డి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్