కంభం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, 9 మందికి తీవ్ర గాయాలు

68చూసినవారు
కంభం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, 9 మందికి తీవ్ర గాయాలు
కంభం మండలం ఎర్రబాలెంలో శనివారం ఆటో అదుపుతప్పి బోల్తాపడ్డ సంఘటనలో 9 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరు పండు(28) మృతి చెందాడు. గాయపడ్డ వారిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఆ వ్యక్తిని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాచర్ల మండలం అనుములవీడు కు ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి పెళ్లి బృందం రోడ్డు ప్రమాదానికి గురైంది. వీరందరూ బేస్తవారిపేట మండలానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్