కంభం: చిత్తడి నేలల సంరక్షణ మనందరి బాధ్యత

65చూసినవారు
కంభం: చిత్తడి నేలల సంరక్షణ మనందరి బాధ్యత
కంభం మండలంలోని జంగంగుంట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం చిత్తడి నేలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ఉక్తలేఖన పోటీలను నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ సమావేశంలో క్లస్టర్ కోఆర్డినేటర్ బి. పిచ్చి రెడ్డి మాట్లాడుతూ.. చిత్తడి నేలలు జీవవైవిధ్యం రక్షణకు తోడ్పడుతుందన్నారు.  అలాంటి వాటిని సంరక్షించుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు.

సంబంధిత పోస్ట్