సుప్రీంకోర్టు తీర్పు పై ఎమ్మార్పీఎస్ నాయకులు ఆనందం

65చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు లో గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గురువారం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని తీర్పు ఇవ్వడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది అని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కృషిచేసిన మందకృష్ణ మాదిగను కార్యకర్తలు నాయకులు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్