ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో రేపు అనగా ఆగస్టు 17వ తేదీ ఉదయం 8. 00 గంటల నుండి మద్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏ. ఈ వెంకట నరసయ్య ఓ ప్రకటన ద్వారా శుక్రవారం తెలిపారు. విద్యుత్తు లైన్ లకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి అధికారులకు సహకరించాలని ఏఈ వెంకట నరసయ్య విజ్ఞప్తి చేశారు.