కనిగిరి ప్రభుత్వ వైద్యశాలను వంద పడకల స్థాయి వైద్యశాలగా మార్పు చేయాలని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ కలెక్టర్ అన్సారియా కు వినతి పత్రం సమర్పించారు. కనిగిరి వైద్యశాల పరిశీలనకు శనివారం వచ్చిన కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ సమస్యలు వివరించారు. వైద్యశాలలో డయాలసిస్ కేంద్రంలో సరైన గదులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని, నూతన డయాలసిస్ కేంద్రం నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు.