వెలిగండ్లలో వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరి ఏ సమయంలోనైనా కూలుటకు సిద్ధంగా ఉంది. వెలిగండ్ల గ్రామానికి తాగునీరుగానీ, వాడుకొనుటగానీ, ఈ ట్యాంకు ద్వారా గ్రామానికి నీటి సరఫరా జరుగుతుంది. అలాంటి వాటర్ ట్యాంకు గత కొన్ని సంవత్సరాల నుండి పిల్లర్స్ కు పెచ్చులు ఊడుతు ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. కావున అధికారులు స్పందించి కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.