పోషకాహారాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తహీనత లేకుండా ఉంటుందని అంగన్వాడీ కార్యకర్త దీపిక అన్నారు. శుక్రవారం కనిగిరి మండలం చాకిరాల అంగన్వాడీ కేంద్రాల్లో కిషోర బాలికలకు రక్త హీనత భారీనా పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆకు కూరలతో కూడిన పౌష్టిక ఆహారం తీసుకోవాలన్నారు. యుక్త వయసు గల అమ్మాయిలు ఆత్మ సంరక్షణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.