ట్రాక్టర్ డ్రైవర్లకు కనిగిరి సీఐ ఖాజావలి శుక్రవారం రాత్రి కౌన్సిలింగ్ ఇచ్చారు. రాత్రి సమయాలలో కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ వల్ల గతంలో ప్రమాదాలు జరిగి కొంత మంది వ్యక్తులు మృతి చెందారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు వారి వాహనాలకు తప్పనిసరిగా రేడియం స్టిక్కర్లను అంటించి ఉండాలని, సరైన లైటింగ్ ఏర్పాటు చేసుకొని రోడ్డు ప్రమాదాలను నివారించాలని తెలిపారు. ఇతరులు ఎవరు ప్రమాదాలకు గురికాకుండా చూడాలన్నారు.