కనిగిరి కస్తూర్బా గాంధీ పాఠశాలలో పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమిడీయన్ తరగతులను శుక్రవారం జిల్లా బాలిక సంరక్షణ అధికారి కె హేమలత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు బాగా చదువుకొని ఆ సబ్జెక్టులో మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హసీనా బేగం, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.