కనిగిరి: హనుమాన్ శోభాయాత్రకు ఎమ్మెల్యేకి ఆహ్వానం

70చూసినవారు
కనిగిరి: హనుమాన్ శోభాయాత్రకు ఎమ్మెల్యేకి ఆహ్వానం
పామూరు పట్టణం లో ఈనెల 22వ తేదీన విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలోహనుమాన్ శోభాయాత్ర జరగనుంది. శనివారం కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని హనుమాన్ శోభాయాత్ర కమిటీ సభ్యులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శోభయాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం హనుమాన్ శోభాయాత్ర కు ముఖ్యఅతిథిగా రావాలని ఎమ్మెల్యేని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్