కనిగిరి పట్టణంలోని స్థానిక గార్లపేట రోడ్డు వద్ద ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో ఆదివారం మహా కుంభాభిషేక కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి దంపతులు మహా కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని, హోమం నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.