కనిగిరి పట్టణంలోని స్థానిక కొత్తూరు వద్ద ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఈనెల 22వ తేదీన హనుమాన్ జయంతి హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీలో పాల్గొనాలని కమిటీ సభ్యులు కోరారు.
.