కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద
చెరువులో చిల్లా చెట్లు దట్టంగా పెరిగాయి. దీంతో అది చిన్నపాటి అడవిని తలపిస్తుండడంతో ఆ ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్లుగా చెరువులో నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో చెరువు చుట్టుపక్కల పంటల సాగు నిలిచిపోయి విష సర్పాలతో, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువును బాగు చేయాలని కోరుతున్నారు.