పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ కు తావు లేకుండా చర్యలు చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కనిగిరి ఎంఈఓ కు వారు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ప్రైవేటు స్కూల్ యాజమాన్యం కొరల్లో చిక్కుకొని ఉందన్నారు. పరీక్ష సెంటర్ నిర్వాహకుల సహాయంతో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నారని తెలిపారు.