రేషన్ పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ హెచ్చరించారు. కనిగిరి పట్టణంలోని ఇందిరా కాలనీలో రేషన్ పంపిణీ చేస్తున్న మొబైల్ వాహనాన్ని మున్సిపల్ చైర్మన్ శుక్రవారం తనిఖీ చేశారు. రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రేషన్ పంపిణీ చేయకుండా నగదు ఇస్తామంటే ఎండియు ఆపరేటర్ల పై చర్యలు తీసుకుంటామన్నారు.