కనిగిరి: చెత్త కుండీలను వినియోగించాలి

81చూసినవారు
కనిగిరి: చెత్త కుండీలను వినియోగించాలి
కనిగిరి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం మున్సిపల్ సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. చెత్త, వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా చెత్తకుండీలను వినియోగించాలన్నారు.

సంబంధిత పోస్ట్