కనిగిరి ఆర్టిసి డిపో పరిధిలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల కొరకు లక్కీ డ్రిప్ బహుమతులను డిపో మేనేజర్ సయానా బేగం బుధవారం అందజేశారు. పామూరు, సిఎస్ పురం మార్గాలలో బస్సులో ప్రయాణం చేసిన ప్రయాణికులకు ఏర్పాటుచేసిన లక్కీ డ్రాను డిపో మేనేజర్ సయానా బేగం తీసి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రమణమ్మ, డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు పాల్గొన్నారు.