పామూరు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్ మరమ్మత్తుల కారణంగా శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి 6 గంటల వరకు పట్టణంలో సరఫరా నిలిచిపోతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి సహకరించాలని ఓ ప్రకటనలో కోరారు.