పామూరు: రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి: తహసిల్దార్ రమణారావు

59చూసినవారు
పామూరు: రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి: తహసిల్దార్ రమణారావు
రెవెన్యూ సదస్సులను వినియోగించుకొని తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని పామూరు మండల తహసిల్దార్ బివి రమణారావు పేర్కొన్నారు. శనివారం మండలంలోని తూర్పు కట్టకిందపల్లి కరోళ్లపాడు రెవెన్యూ గ్రామాల్లో గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా తహసిల్దార్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు నిర్ణీత కాలంలో పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం రెవెన్యూ సదస్సుకు విచ్చేసిన ప్రజల దగ్గర నుంచి అర్జీలను స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్