కనిగిరి మున్సిపాలిటీలోని కొత్తూరు ఏడో వార్డులో మంగళవారం మున్సిపల్ ఇన్ ఛార్జ్ ఏ. ఈ నాగలక్ష్మి సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు అవసరమైన కొలతలు తీసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొత్తూరు లోని చింతకుంట్ల వారి వీధి, భూమిరెడ్డి బజారులో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన కొలతలు తీసుకున్నారు. సిమెంట్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలన్ని సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తున్నట్లు తెలిపారు.