సిఎస్ పురం మండలంలోని అయ్యలూరివారిపల్లిలో ఆదివారం సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శనివారం తెలిపారు. పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి రూ. 30,116లు, ద్వితీయ బహుమతి రూ. 20, 116లు, తృతీయ బహుమతిగా రూ. 10,116లు అందజేస్తున్నట్లు వారు తెలిపారు. పేర్లు నమోదు చేసుకున్న క్రీడాకారులందరూ ఆదివారం ఉదయం 10 గంటల వరకు హాజరుకావాలని కోరారు.