కనిగిరి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. పట్టణంలోని శివారు ప్రాంతాలను బుధవారం డ్రోన్ కెమెరాతో వారు పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం పట్టణంలో డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నామని తెలిపారు. అందరూ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని పోలీసులు సూచించారు.