వెలిగండ్లలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ అర్జున్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని తెలిపారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను నిర్మూలించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఎంపీడీవో మహబూబ్ బాషా, జడ్పిటిసి తిరుపతిరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి పాల్గొన్నారు.