రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శుక్రవారం మంత్రులకు శాఖలు కేటాయించారు. అందులో భాగంగా కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖ, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొండేపి నియోజకవర్గం లోని తెలుగుదేశం, జనసేన, బిజెపి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, స్వామి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.