ప్రకాశం జిల్లా సింగరాయకొండ కు చెందిన ఓ వైసిపి నేత క్రికెట్ బెట్టింగ్ ముఠాకు సూత్రధారి అని పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. ఈనెల 8వ తేదీ నుంచి అజ్ఞాతంలో ఉన్న నిందితుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే బెట్టింగ్ పై కీలక ఆధారాలను పోలీసులు సేకరించినట్లుగా తెలుస్తోంది. విచారణ అనంతరం పూర్తి వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు.