శ్రీకాకుళం జిల్లా నందిగాం అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై మంత్రి బాల వీరాంజనేయస్వామి బుధవారం విచారం వ్యక్తం చేశారు. ఘటనపై కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని, ఘటనపై దర్యాప్తు ఆదేశించారు. విద్యార్దిని కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాడ సానుభూతి తెలిపారు. విద్యార్దులు మనోధైర్యాన్ని కోల్పోయి ప్రాణాలు తీసుకుని బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దన్నారు.