ఎల్ అర్జీ 52 రకం కంది విత్తనాలు 30% రాయితీపై పంపిణీ చేయనున్నట్లు మర్రిపూడి మండల వ్యవసాయ అధికారి సీహెచ్ వెంకటేశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 4 కేజీల సంచి రూ. 394. 44కు అందజేస్తున్నామని ఏవో పేర్కొన్నారు. కావలసిన రైతులు ఆధార్, పాసు పుస్తకం, ఫోన్ నంబర్ తీసుకొని సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రంలోకి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలని ఏవో తెలిపారు.