ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం టిడిపి కార్యాలయంలో శనివారం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి మంత్రి స్వామి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను మంత్రి స్వామి కొనియాడారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.