సింగరాయకొండ పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న ట్రాక్టర్ ఢీకొని ఆటో డ్రైవర్ మృతి చెందిన విషయంలో ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ సంబంధిత వ్యక్తి రాజీ చేసుకునేందుకు మృతుడి బంధువులను ఆశ్రయించాడు. మృతుడి బంధువులు రాజీ కుదుర్చుకునే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుగా వెళ్లిన కానిస్టేబుల్ లపై కూడా దాడికి పాల్పడడంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.