టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో ఇప్పటి వరకు పొగాకు కేజీ గరిష్ఠ ధర రూ. 360 పలికినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఎం నిడమానూరు క్లస్టర్ గ్రామాలకు చెందిన రైతులు 1041 బేళ్లను బుధవారం వేలానికి తీసుకువచ్చారు. వాటిలో 965 బేళ్లు కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 76 బేళ్లను తిరస్కరించారు. పొగాకు సరాసరి ధర కేజీ రూ. 313. 79, కనిష్ఠ ధర రూ. 205 పలికిందని పొగాకు వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.