ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మార్కాపురం డీఎస్సీ నాగరాజు తెలిపారు శుక్రవారం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ముమ్మర తనిఖీలను నిర్వహించారు. ద్విచక్ర వాహనాలను ఆపి వాహన పత్రాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, వేగం కన్నా ప్రాణం మిన్న అని అన్నారు. అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుందనే సూక్తులను వాహనాదారులకు గుర్తు చేశారు.