పామూరు పట్టణంలోని నెల్లూరు రోడ్డులోని శ్రీచైతన్య స్కూల్ వెనకవైపు ఎటువంటి అనుమతులు లేని సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలని స్థానికులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చి ఆపినా లెక్క చేయకుండా రాత్రికి రాత్రే టవర్ నిర్మాణ పనులు మొదలుపెట్టారని మండిపడ్డారు. అనంతరం తహశీల్దార్ రమణారావుని
కలిసి వినతిపత్రం సమర్పించారు.