రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలో ఉన్న శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి ఆలయం వద్ద శనివారం కురిసిన వర్షానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అటువైపుగా వెళ్లే వాహనదారులకు ప్రయాణికులకు భక్తులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఒకవైపు వరదనీరు మరోవైపు నేలకొరిగిన భారీ వృక్షాలతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు తక్షణ చర్యలు చేపట్టారు.