మర్రిపూడి మండలంలోని గుండ్ల సముద్రంలో పశువుల మేత కోసం పోరంబోకు భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఒంగోలులోని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణను పలువురు రైతులు కలిసి శుక్రవారం ఫిర్యాదు చేశారు. జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి వెంటనే విచారణ చేయాలని కనిగిరి ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. భూమిని అక్రమంగా ఆన్లైన్ చేసినట్లు రుజువైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.