ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని 94 ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్ఎంసి ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంఈఓ లు రాందాస్ నాయక్, శ్రీనివాసులు శుక్రవారం తెలియజేశారు. ఇప్పటికే అన్ని స్కూళ్లలో ఎస్ఎంసి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్, ఓటరు జాబితా విడుదల చేసినట్లు తెలిపారు. ఈనెల 5వ తేదీ సాయంత్రం లోపు ఓటరు జాబితాలో ఏవైనా సవర్ణలు ఉంటే చేసుకోవచ్చని తెలిపారు.