అణగారిన సమాజంలో వెలుగులు పూయించిన తపన పడే సామానత్వం కోసం బతుకంతా ధిక్కార కవిత్వం రాసిన దళిత కవిత్వ దళ నాయకుడు మద్దూరి నగేష్ బాబు అని యోగి వేమన విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ వినోదిని పేర్కొన్నారు. బహుజన కెరటాలు ప్రచురించిన నగేష్ బాబు సమగ్ర కవిత్వం పుస్తక ఆవిష్కరణ సభ ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్ లో గురువారం జరిగింది. ముఖ్యఅతిథిగా డాక్టర్ వినోదిని పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.