డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 5వ తేదీన జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవం లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అర్హత కలిగిన ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ఉన్న ఉపాధ్యాయులు మూడు విభాగాల్లో అవార్డుల కోసం సంబంధిత మండల విద్యాశాఖ అధికారులకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.