ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద పోలీసులు అడుగడుగునా పహారా కాస్తున్నారు. బుధవారం వైసీపీ నాయకులు తలపెట్టిన యువత పోరు కార్యక్రమం ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలెక్టరేట్ వద్దకు పోలీసు సిబ్బంది చేరుకున్నారు. కలెక్టరేట్‌లోకి ప్రవేశిస్తున్న వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోనికి అనుమతిస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందుగానే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.