నాటి స్వాతంత్య్ర పోరాటాల్లో కారంచేడుకు చెందిన 18 మంది యోధులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ పిలుపుతో వీరంతా ఆనాడు దండి ఉప్పు సత్యాగ్రహంలో పాలు పంచుకున్నారు. గ్రామంలోని పాత శివాలయం వద్ద వీరు సమావేశమైనట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు వీరంతా జైలు జీవితం గడిపారు. ఇప్పటికి వారి పేర్లతో ఉన్న శిలాఫలకం కారంచేడు పెద బజారు శివాలయం ప్రహరీపై ఉంది.