ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం శుభపరిణామమని సంతనూతలపాడు ఎమ్మెల్యే బి. ఎన్ విజయ్ కుమార్ తెలిపారు. నాగులప్పలపాడు మండలం, ఉప్పుగుండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. విద్యార్థులకు స్వయంగా భోజనాన్ని వడ్డించి నాణ్యతను పరిశీలించారు అనంతరం ఆయన కూడా భోజనం చేశారు.