గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణ ఉండేలా ప్రజలంతా సహకరించాలని పుల్లలచెరువు మండలంలోని ఎండ్రపల్లి పంచాయతీ కార్యదర్శి నలగాటి. అత్మానంద సత్యనారాయణ నాయుడు అన్నారు. శనివారం ఎండ్రపల్లి సచివాలయంలో స్వర్ణాంధ్ర -స్వచ్చాంద్ర కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, సచివాలయ ఉద్యోగులు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇళ్లలోని చెత్తను దూరంగా పడేయాలని కోరారు. ఈఓఆర్డీ శ్రీనివాస్ పర్యవేక్షణ చేశారు.