బడిబయట పిల్లలను బడిలో చేర్పించాలని మర్రివేముల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని మాధురి పుష్పమి అన్నారు. శనివారం ఆ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ అధ్యక్షతన పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ కమిటీ సభ్యులు ప్రతీ నెలా నిర్వహించే సమావేశాలకు అందుబాటులో ఉండాలని కోరారు. సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు, సభ్యులు పాల్గొన్నారు.