ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని స్థానిక శాఖా గ్రంధాలయంలో ఆదివారం అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ కలం నుండి జాలువారిన అతడు ఆమె ట్రాన్స్ జెండర్ కథ డైలీ సీరియల్ గా ప్రజలలో ఉత్కంఠ రేపిన కథ, సాహితీవేత్త గొట్టిముక్కుల నాసరయ్య రాసిన నడిచే నీడలు కవితా సంకలనం పుస్తకాలను శ్రీశ్రీ కళావేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య స్థానిక గ్రంథపాలకులు జి. రామాంజినాయక్ కు అందజేశారు. ఆసక్తి కలిగిన ప్రజలు గ్రంధాలయానికి వచ్చి చదువుకోవాలని వారు అన్నారు.