55 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం: డి.టి గీతారాణి

79చూసినవారు
55 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం: డి.టి గీతారాణి
పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలో మంగళవారం అక్రమంగా తరలిస్తున్న 55 బస్తాల రేషన్ బియ్యాన్ని"ఎన్ ఫోర్స్ మెంట్" డి. టి గీతారాణి స్వాధీనం చేసుకున్నారు. మాట్లాడుతూ అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాలను తన సిబ్బందితో తనిఖీ చేయగా జాతీయ రహదారి వైపు వెళుతున్న వాహనంలో రేషన్ బియ్యం పట్టుబడినట్లు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్ పై కేసు నమోదు చేసి, రేణింగివరం పోలీస్ స్టేషన్ కు తరలించామని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్