అద్దంకి: దోపిడీ కోస‌మే గుండ్లక‌మ్మ గేట్లను విర‌గ్గొట్టారు: మంత్రి గొట్టిపాటి

58చూసినవారు
అద్దంకి: దోపిడీ కోస‌మే గుండ్లక‌మ్మ గేట్లను విర‌గ్గొట్టారు: మంత్రి గొట్టిపాటి
వైసీపీ హ‌యాంలో ఇసుక దోపిడీ కోస‌మే గుండ్లక‌మ్మ ప్రాజెక్ట్ గేట్లను విర‌గ్గొట్టారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం ఆరోపించారు. అద్దంకి నియోజకవర్గం బల్లికురవలో పర్యటించిన ఆయన గుండ్లక‌మ్మ నుంచి వైసీపీ నేత‌లు రూ. కోట్ల విలువైన ఇసుకను దోపిడీ చేశారన్నారు. కూట‌మి అధికారంలోకి వచ్చిన తరువాత గుండ్లకమ్మ మ‌ర‌మ్మతులకు నిధులు కేటాయించిందన్నారు. కాలువ‌ పూడికతీత‌, మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్