అద్దంకి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయం నందు గురువారం జనసేన కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బత్తుల చందు పాల్గొని కార్యకర్తలకు జనసేన పార్టీ అందించిన కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చందు పిలుపునిచ్చారు.