అద్దంకి మండలం గోపాలపురం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడు గ్రామానికి చెందిన గోసాల అంజయ్యగా స్థానికులు గుర్తించారు. 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.