బల్లికురవ మండలం, నక్కబొక్కలపాడు గ్రామ సమీపంలోని శ్రీ ఈర్ల గంగమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ తిరునాళ్లలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం పాల్గొన్నాారరు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతిపథంలో పయనించాలని కోరుకున్నట్లు ఆయన వివరించారు.