రేబిస్ వ్యాధికి టీకాలు వేయించండి

80చూసినవారు
ఈనెల 6వ తేదీన ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా కొరిశపాడు మండలం కొరిశపాడులోని పశు వైద్యశాల నందు పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ టీకాలు వేయునట్లు మండల పశు వైద్యాధికారి డాక్టర్ వెంకట్రావు శుక్రవారం మీడియా సమావేశంలో తెలియజేశారు. అలాగే ఎవరైనా వీధి కుక్కలను తీసుకువస్తే వాటికి కూడా టీకాలు వేస్తామని ఆయన చెప్పారు. కావున పెంపుడు కుక్కల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్